కరీంనగర్ కవుల ‘ఎన్నీల ముచ్చట్లు’

కరీంనగర్, ప్రతినిధి :
అది పున్నమి వెన్నెల రాత్రి.. డాబా పైన ఆకాశం నిర్మలంగా ఉంది.. ఒక్కొక్కరుగా కరీంనగర్ జిల్లాలో పేరొందిన కవులు.. కొత్త రచయితలు, మేధావులు, వివిధ రంగాల్లోఉన్న  సాహిత్యాభిమానులు డాబాపైకి వచ్చారు. ఈ నెలరోజుల్లో తాము రాసిన కవితలను పున్నమి వెన్నెల్లో ఆవిష్కరించారు. ఆద్యంతం కవిత్వరసం జాలువారిన ఈ సమావేశాల్లో మరుగునపడిపోయిన తమ కవిత్వాలను వెలికి తీసే అద్భుతం అవకాశంగా కవులు భావిస్తున్నారు.

కరీంనగర్ కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. జిల్లాలోని కవులు, మేధావులు, నిపుణులు ప్రతీ నెల ఒక్కొక్కరి ఇంటిలో పున్నమినాడు ‘ఎన్నీల ముచ్చట్లు’ పేరుతో నిర్వహించే ఈ కవితాగానం అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నవతరం కొత్త కవులకు దారి చూపిస్తోంది. కరీంనగర్ జిల్లా కవులైన గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, నగునూరి శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.