
మహాదేవ్ పూర్ ఏటూరు నాగారం ఏరియా మావోయిస్టు దళం డిప్యూటీ కమాండర్ కాట్రేవుల లింగయ్య అలియాస్ మల్లేష్ 24) గురువారం నాడు కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు వివరాలను ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుకు పునారావాసం కింద లక్ష రూపాయల రివార్డు అందజేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో 32 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని.. వెంటనే అందరూ జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
2011లో అజ్ఞాతంలోకి వెళ్లిన కాట్రేవుల లింగయ్య అలియాస్ మల్లేష్(24) చత్తీస్ ఘడ్ వెళ్లి బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుగా జీవితం ప్రారంభించాడు.. 2011 నుంచి ఇప్పటి వరకు ఏటూరు నాగారం, మహదేవ్ పూర్ కమిటీ, కెకె డబ్ల్యూ లో జూన్ నుంచి డిప్యూటీ కమాండర్ పదోన్నతిిపై అదే దళంలో పని చేశాడు.. చత్తీస్ ఘడ్ లో ఇద్దరు పోలీసులను హతమార్చడంతో పాటు దుద్దెడ అన్నారం గ్రామాల్లో ఇన్ఫార్మర్ల పేరిట ముగ్గురు గ్రామస్థులను హతమార్చిన సంఘటనలో నిందితుడు.. టేకుల గూడెంలో ఒక రోడ్డు రోలర్.. మూడు టిప్పర్లు,ఒక ప్రొక్లెన్ ను దగ్ధం చేయడంతోపాటు చత్తీస్ ఘడ్ ఎదురుకాల్పుల సంఘటనలో పాల్గొన్నాడు.
మావోయిస్టుల్లో అంతర్గత విభేధాలు, సిద్దాంతాలు నచ్చకపోవడంతో పాటు అనారోగ్య సమస్యలతో లొంగిపోయాడు. మావోయిస్టు లోంగుబాటుకు కృషిచేసిన పోలీసులను ఎస్పీ జోయల్ డేవిస్ అభినంధించారు.