కరీంనగర్ ఆర్ అండ్ బీలో స్కాం..

– వందల కోట్ల రోడ్లు కాంట్రాక్టర్లు అధికారులు,

– 18 మంది కాంట్రాక్టర్లు కుమ్మక్కు..

– పోటీ లేకుండానే గంపగుత్తగా పనులు విభజించి దోచుకుంటున్నారు..
– 5 శాతం ఎక్కువగా ఎక్సెజ్ టెండర్ ఇస్తూ ప్రభుత్వ సొమ్ము దోపిడీ..
– 1000 కోట్లు వస్తే 200 కోట్లదాకా మింగడానికి ప్లాన్..

-ఇందులో ఆర్ అండ్ బీ ఉన్నతాధికారుల కు హస్తం..
ఎన్నికలకు 5 లక్షలు సొమ్ము..
కరీంనగర్ : కరీంనగర్ లో రోడ్ల మరమ్మతు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో వందల కోట్ల స్కాం జరుగుతోంది.. ఆర్అండ్ బీ అధికారులు- కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులకు టెండర్లను ఎక్సెస్ ధరకు కేటాయిస్తూ వందల కోట్లు దోచుకుంటున్నారు. కంకర,సిమెంటు రోడ్ల విషయంలోనూ నాసిరకమైనవే వాడుతున్నారు. అందులో అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి..

10HYDPS04-KNR2_GPD1_179671e

కరీంనగర్ జిల్లాలో రోడ్డు పనులను కరీంనగర్ రోడ్డు రవాణా శాఖలోని ఉన్నతాధికారి ఎక్సైస్ ధరకు టెండర్ ను దాఖలు పరిచారు. ఉదాహరణకు 1000 కోట్ల నిధులు పనులకు మంజూరైతే ఓపెన్ టెండర్ వేస్తే 850 కోట్లకే లెస్ టెండర్లు వేసేవారు.. కొందరికే టెండర్లు దాఖలు చేయాలని ఉన్నతాధికారి మిక్చర్ యూనిట్లు ఉండాలని నిబంధన పెట్టడంతో టెండర్ కొందరికే దక్కాలని కుట్ర పన్నారు. దీంతో మిక్చర్ కాంట్రాక్టర్లు 1000 కోట్ల కంటే 5 శాతం అదనంగా అంటే 1049 కోట్లకు టెండర్ వేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారి 50 కోట్లు అదనంగా కేటాయించి మింగడానికి ప్రయత్నిస్తున్నారు..

5 శాతం టెండర్ ఎక్కువైతే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.. కానీ 4.99కే టెండర్ వేసేలా ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లు కుమ్మకై పంచుకునేందుకు ఇలా చేస్తున్నారు.. 1049 కోట్ల టెండర్ దాఖలు పరిచే అధికారం ఆర్ అండ్ బీ అధికారికే ఉండడంతో ఈ వ్యవహారంలో వందల  కోట్ల దోపిడీ జరుగుతోంది..

టెండర్ ధర పెంచేసి  కాంట్రాకర్ కు దోచి పెట్టేందుకు ఆర్ అండ్ బీ అధికారులు సిద్ధమయ్యాడు.. ఈ సదురు అధికారితో జిల్లా ప్రజాప్రతినిధులకు దగ్గరి సంబంధాలున్నాయి.. గడిచిన ఎన్నికల వేళ ఈయన తన అవినీతి సొమ్మును 5 లక్షల చొప్పున ప్రజాప్రతినిధుల ఎన్నికల ఖర్చు కింద ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ ప్రజాప్రతినిధులు ఈయనను ఎదురించే సాహసం చేయడంలేదు… అందుకే కాంట్రాక్టుల్లో వందల కోట్ల గోల్ మాల్ కు పాల్పడుతున్నా కనీసం జిల్లా మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిదులు కనీసం పట్టించుకోవడంలేదు.. ఈ దందాలో వారికి మామూళ్లు వెళుతూనే ఉన్నాయి.. అందుకే ఏళ్లుగా ఇక్కడే ఆయన కొనసాగుతున్న ఎవరూ ఆయనన కదపడం లేదు..

HY31-BAD_ROADS_2085769g
ఇటీవల టెండర్లలో పోటీ టెండర్ లేకుండా పనులను చిన్న చిన్నగా విభజించిన సదురు ఉన్నతాధికారి గంపగుత్తగా కాంట్రాక్టులను అప్పగించారు. ఈ వ్యవహారంలో దాదాపు 1000 కోట్ల రోడ్డు పనిలో 200 కోట్లు వీరి ఖాతాలోకే వెళుతున్నట్టు సమాచారం. ఓపెన్ టెండర్ వేయక తమకు నచ్చిన వ్యక్తులకు ఇష్టసారంగా వీటిని కేటాయించారు. దీంతో కరీంనగర్ లో అవినీతి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *