
కరీంనగర్ : రైతు సందేశ యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొనసాగనుంది. ఈ పర్యటన పర్యవేక్షించేందుకు శనివారం వీ హనుమంతరావు కరీంనగర్ లో పర్యటించారు. డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, గందే మాధవి, గందే మహేశ్ , అంజన్ కుమార్ వైదుల తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.