కరీంనగర్ అడిషనల్ ఎస్పీగా అన్నపూర్ణ బాధ్యతల స్వీకరణ

కరీంనగర్ జిల్లా అడిషనల్ ఎస్పీ(పరిపాలన)గా టి. అన్నపూర్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్ నకు చెందిన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువకాలం పనిచేశారు.
చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేసి బదిలీ అయ్యి వేయిటింగ్ లో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి జోయల్ డేవిస్ , ఓఎస్.డీ ఎల్ సుబ్బారాయుడలను కలిశారు. జిల్లా పోలీసు అధికారుల అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలందించారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులందరూ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రీనివాస్, ఏ.ఆర్.డీఎస్పీ కోటేశ్వర్ రావు, ఆర్ఐలు గంగాధర్, అసోసియేషన్ అధ్యక్షులు యం. సురేందర్, ప్రతినిధులు సాగర్, మల్లయ్య, పండరి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *