
కరీంనగరంలోని అంబేద్కర్ స్టేడియంలో 500 కంపెనీలకు పైగా వివిధ దేశీయ, అంతర్జాతీయకంపెనీలు ఉద్యోగ మేళా పెట్టాయి.. చాలా కంపెనీలు తమ సంస్థల్లో ఉన్న ఉద్యోగ వివరాలను జాబితాలతో బోర్డులపై పెట్టారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు వెల్లువలా వచ్చారు. నిరుద్యోగులతో అంబేద్కర్ స్టేడియం కిక్కిరిసిపోయింది..
పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ జాం కావడంతో ప్రత్యామ్మాయ చర్యలు చేపట్టారు. కాగా ఫార్మా,ఇంజనీరింగ్, మెకానికల్, వివిధ క్లర్క్ లు, పలు రకాల కార్మిక కేటగిరీల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.. నిరుద్యోగులు ఖాళీల వివరాలను తెలుసుకొని దరఖాస్తులు సమర్పించారు.