జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ పట్టించుకోరా?

journalist

కరీంనగర్: పక్కనే ఉన్న ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల విద్యాశాఖాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందించారు. వరంగల్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో 50శాతం ఫీజు రాయితీ కల్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో పిల్లలకు సైతం ఫీజు రాయితీ కల్పించారు. కానీ కరీంనగర్ విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్ ఈ విషయంలో ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాల్సిన జిల్లా జర్నలిస్టులు ఆ పనే తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. పక్కజిల్లాల్లో అమలైన ఫీజు రాయితీ కరీంనగర్ లో అమలు కాకపోవడంపై జిల్లా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరీంనగర్ లో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని వారు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *