కరాటే ఆత్మ రక్షణకు దోహదపడుతుంది

కరీంనగర్: మార్షల్ ఆర్ట్స్(కరాటే)లోని యుద్దతంత్ర కళలు ఆత్మరక్షణకు దోహదపడతాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. శరీరాన్ని ఆయుధంగా మలుచుకుని శత్రువుతో పోరాడే శక్తి కరాటేకు ఉందని ఆయన  పేర్కొన్నారు. షీటీంలకు చెందిన సబ్యులకు మార్షల్ ఆర్ట్స్ లోని యుద్దతంత్ర కళలపై శిక్షణ ఇస్తున్నారని ఇందులో భాగంగా శనివారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ ధియేటర్ ఆవరణలో ఏర్పాటైన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి కమీషనర్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధతంత్ర కళలను శ్రద్దగా నేర్చుకోవాలన్నారు. ప్రతిభను ప్రదర్శించే వారికి సర్గిఫికెట్లను అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ గంగాధర్, ఆర్ఎస్ఐలు స్వామి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

karate     karate

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.