కరాటె బెల్టుల ప్రదానం

ఒకినావా స్కూల్ ఆఫ్ కరాటే ఆధ్వర్యంలో స్థానిక వావిలాలపల్లి లోని విద్యాధరి హైస్కూలులో కరాటె గ్రేడింగ్ టెస్టును నిర్వహించారు. ఈ గ్రేడింగ్ టెస్టులో 32 మంది విద్యార్థులు పాల్గొని కటాస్, స్పారింగ్, వెపన్స్ , స్పిన్నింగ్ , కిక్ తదితర అంశాలలో అత్యంత నైపుణ్యత ప్రదర్శించి వివిధ రకాల బెల్టులను గెలుపొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అరబిందో సొసైటీ జిల్లా అధ్యక్షులు ఇంజనీర్ కోల అన్నారెడ్డి హాజరై కరాటె విద్యను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.

ఒకినావా చీఫ్ ఎగ్జామినర్ కే.వసంత్ కుమార్ టెస్టు నిర్వహించి బెల్టులను , సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. . కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జే. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ హరిచరణ్, , సీనియర్ కరాటె ఇన్ స్ట్రక్టర్ కే.ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ మంజులారాణి విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *