Breaking News

కమ్మునూరు పుష్కర స్నానం ఆచరించండి..

kammunuru

ప్రకృతి రమనీయతకు ఆలవాలమైన కమ్మురు గ్రామంలో పుష్కర పుణ్యస్నానం ఆచరించి పుణితులు కావాలని, దివ్యానుభుతిని పోందాలని జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్ భక్తులను కోరారు. మంగళవారం కమ్మునూర్ గ్రామంలోని పుష్కర ఘాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు, కమ్మునూరు పుష్కర ఘాట్ వద్ద అన్నిసౌకర్యలను కల్పించినట్లు తెలిపారు. మహిళల కోసం బట్టలు మార్చుకునే గదులను, త్రాగునీటి వసతిని, మరుగుదోడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వచ్చమైన నీరు పుష్కర ఘాట్ల వద్ద ప్రవహిస్తుందని, ఈ నీటిలో స్నానం చేసి దైవానుగ్రహనికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. పిత్రు దేవతలకు శ్రాద్ద కర్మలు కూడా ఇక్కడ నిర్వహించ వచ్చని కలేక్టర్ వివరించారు. కడెం ప్రాజెక్టు నుండి 20 కి.మి దూరంలో కరీంనగర్, ఆదిలాబాద్, సరిహద్దులో ఉన్నదని తెలిపారు. కడెం ప్రాజెక్టు నీరు కమ్మునూరు గ్రామం ద్వారా కరీంనగర్ కు ప్రవహిస్తుందని తెలిపారు. సారంగపూర్ మండలానికి 20 కి.మి, జగిత్యాలకు 40కిమి దూరంలో ఉన్న ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కూడా ఉందని వివరించారు. ఈ గ్రామంలో నది తిరంలో వెలసిన ఆంజనేయ స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చె దేవాలయంగా ప్రసిద్ది చెందిందని కలెక్టర్ వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *