
కరీంనగర్: బాబ్రిమసీదు కూల్చివేత నేపధ్యంలో కమీషనరేట్ పరిధిలో సోమవారం సాయంత్రం 5గం!!ల నుండి బుధవారం ఉదయం 6గం!!ల వరకు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు పరుచడం జరుగుతుందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్ అమలు ప్రభావంతో సబలు, సమావేశాలు, ధర్నాలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు శాంతికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారంతో 144 సెక్షన్ ను అమల్లోకి తేవడం జరిగిందని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.