కబళిస్తున్న జికా వైరస్ పై ఫోకస్

JICA-virus-outbreak-on-solid-facts-detrimental-to-the-new-generation

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిపై భారత్ అప్రమత్తమైంది. భారతీయ గర్భిణులను విదేశాలకు టూర్లు వెళ్లవద్దని సూచించారు. జికా వైరస్.. ఇప్పడు దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలను వణికిస్తోంది..  దీని బారిన గర్భిణులు పడి వారి పిల్లలు మెదడు వృద్ది లేకుండా పుడుతున్నారు.  దీనివల్ల మెదడు లేని అంగవైకల్య పిల్లల భవిష్యత్తు అంధకారమవుతోంది..  ఇది ప్రధానంగా దోమల వల్ల వ్యాపిస్తుంది. మొదటగా దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ లో వెలుగుచూసింది.. ఈ వైరస్ సోకిన గర్భిణుల పిల్లలు ఇక పుట్టిన వారితో ప్రయోజన శూన్యమే.. ప్రస్తుతం ఇది అమెరికా, కెనడా దేశాలకు వ్యాపించింది. దీనిపై కెనడా, అమెరికా, దేశాలు, వివిధ ప్రపంచ దేశాలు సైతం దృస్టి సారించాయి. వెంటనే టీకాను తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి..

ఈ వైరస్ కు టీకా మందులు లేకపోవడంతో గర్భిణులు పిల్లల్ని కనకుండా బ్రెజిల్ తదితర దేశాల్లో అబార్షన్ లు చేసుకుంటున్నారు. వ్యాధికి మందులేక ఇప్పటికే 40లక్షల మంది బతుకుజీవుడా అని మృత్యువుకు దగ్గరవుతున్నారు. దీనికి పరిష్కారం లేక దోమల సంహారమే ప్రధాన కర్తవ్యమని బ్రెజిల్ దోమల నివారణకు చర్యలు చేపట్టింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *