కన్షయ్య కు బెయిల్.. జేఎన్ యూలో సంబరాలు

Kanhiya-Kumar-JNU443-580x395

జేఎన్.యూ లో జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాది వర్ధంతి సభ నిర్వహించి దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన విద్యార్థి నాయకుడు కన్హయ్యకు ఢిల్లీ హై కోర్టులో ఊరట లభించింది. సుప్రీం కోర్టు కన్హయ్యకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.. హైకోర్టులో విచారణ కొనసాగించాల్సిందిగా కోరింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో కన్హయ్యకు ఇవాళ బెయిల్ మంజూరైంది. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా కన్హయ్యకు బెయిల్ మంజూరు కావడంతో జేఎన్యూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.

కాగా ఇటీవల కన్షయ్య కోర్టు వచ్చినప్పుడు న్యాయవాదులు దాడి చేశారు. దేశద్రోహి అంటూ చితకబాదారు. పార్లమెంటు పై దాడి చేసిన ఉగ్రవాదుల వర్ధంతిని యూనివర్సిటీ లో నిర్వహించి అరెస్ట్ అయిన సీపీఐ విద్యార్థి నాయకుడికి ఇప్పట్లో కష్టాలు తొలిగేలా లేవు. జాతీయ కాంగ్రెస్ సీపీఐ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అతడి విడుదల సాధ్యం కావడం లేదు. బీజేపీ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టడం కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడంతో ఎరక్కపోయి ఇరుక్కున్నాడు కన్హయ్య..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *