కన్న కొడుకు గురించి తెలియని హీరో నాయకుడైతే..

akira-nandan-5

పవన్ కళ్యాణ్ చాలా విచిత్రమైన మనిషి.. ఆయన ఆహార్యం.. భాష, పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. ఈ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ అన్ని చానాల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్  తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్  అంచనాలను అందుకోలేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం చానాళ్ల వెంట పడ్డాడు. ఈ సందర్భంగా సినిమా నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ హిందీ లో విడుదల చేసేందుకు ప్రయత్నించడం కేవలం మార్కెట్ పెంచుకోవడానికేనన్నారు. హిందీలో , తెలుగు లో తెలుగు సినిమాకు స్థాయికి పెంచడమే ధ్యేయమన్నారు.

కాగా ఇంటర్వ్యూల్లో పవన్ తన వ్యక్తి గత విషయాలను వెల్లడించారు. తన కొడుకు అఖిరా వయసు తనకు తెలియదని.. అసలు వాడు ఎంత చదువుతున్నాడో కూడా తెలియదన్నారు. కన్నతండ్రి అయ్యి ఉండి కొడుకు బర్త్ డే కూడా మరిచిపోయానని ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అఖీరా బర్త్ డే ఏప్రిల్ 8న సర్దార్ రిలీజ్ చేద్దామనుకున్నా అఖీ రా బర్త్ డే మరిచిపోయానన్నారు. కాగా త్వరలో నాయకుడిగా మారుతానన్న పవన్ కన్న కొడుకు బర్త్ డే నే మరిచిపోవడంపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *