కన్నబిడ్డలను 3 లక్షలకు అమ్మకానికి పెట్టాడు..

కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామానికి చెందిన బుర్రా మల్లేషంకు మొదటి భార్యతో విడాకులయ్యాయి.. వారికి ఇద్దరు పిల్లలు.. భార్య వేరుగా ఉంటుండగా.. తండ్రితోనే పిల్లలిద్దరు ఉంటున్నారు.

కాగా విద్యాబుద్దులు నేర్పించి తీర్చిదిద్దాల్సిన తండ్రే పిల్లలను 3 లక్షలకు విక్రయానికి పెట్టడం సంచలనం రేపింది. బోయినపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తికి ఇద్దరిని 3 లక్షలకు అమ్మడంపై తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి విచారించగా.. విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నానని.. 20 వేలు అడ్వాన్స్ గా తీసుకున్నానని తండ్రి మల్లేషం చెప్పాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *