కన్నపు దొంగ అరెస్టు

కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని కన్నపుచోరీలకు పాల్పడిన దొంగ అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందు(22)ను మంగళవారం నాడు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్దనుండి 28 1/2 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోద్య గ్రామానికి చెందిన అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందు(22) తండ్రి ఆధరణ కరువవ్వడంతో చెడు సహవాసాలు చేసి చిన్నతనం నుండే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు రెండుసార్లు జైలుకెళ్లి వచ్చాడు. కొన్ని రోజులు హైదరాబాద్ లోని ఒక రిసార్ట్స్ లో పనిచేశాడు. గత నెల 18న కరీంనగర్ లోని బోయవాడలో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడు. అన్నికోణాల్లో విచారణ జరిపిన వన్ టౌన్ పోలీసులు సిసిటివి పుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం నాడు ఉదయం జగిత్యాల నుండి హైదరాబాద్ కు బస్సులో వెళుతుండగా వలపన్నిపట్టుకున్నారు. విచారణలో కోరుట్ల, మెట్ పల్లిలో పాల్పడిన నేరాలను అంగీకరించారు. దొంగను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వన్ టౌన్ పోలీసులు, సాంకేతిక విభాగం అధికారులను కమీషనర్ అభినందించి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి టి. అన్నపూర్ణ, ఎసిసి జె.రామారావు, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

v.b kamalasan reddy..

దొంగతనాల నివారణపై కరపత్రం ఆవిష్కరణ

వివిధ రకాల దొంగతనాల నివారణపై వన్ టౌన్ పోలీసులు రూపొందించిన కరపత్రాన్ని కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మంగళవారం నాడు ఆవిష్కరించారు. వివిధ రకాల దొంగతనాలు, దొంగలు పాల్పడే పద్దతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సవివరంగా ఇందులో వివరించారు.

v.b kamalasan reddy...

సమర్ధవంతమైన సేవలందించాలి

సమర్ధవంతమైన సేవల ద్వారానే పోలీసులకు గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. సిటి పోలీసు శిక్షణ కేంద్రం (సిపిటిసి)లో మంగళవారం నాడు ఆర్ముడు రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి పొందనున్న పోలీసులకు శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు క్రమశిక్షణతో మెదులుతూ అంకితభావంతో విధులను నిర్వహించాలని చెప్పారు. శిక్షణలోని అంశాలను సందర్భోచితంగా వినియోగించాలని సూచించారు. ఖమ్మం సైబరాబాద్, రాచకొండ జిల్లాలకు చెందిన పోలీసులు శిక్షణ పొందారు. వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిటిసి ఇంఛార్జి ప్రిన్సిపాల్ టి. అన్నపూర్ణ, ఇన్ప్ పెక్టర్లు రంగయ్య, సీతారెడ్డి, ఎస్ ఐలు సరిలాల్, నాగేశ్వర రావు, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

v.b kamalasan reddy......

పదవి విరమణ పొందిన పోలీసులకు సన్మానం

పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన పోలీసులను మంగళవారం నాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి సన్మానించారు. పదవి విరమణ పొందిన పోలీసుల కుటుంబసభ్యులందరినీ ఆహ్వనించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవి విరమణ పొందిన పోలీసులు ఎఆర్ఎస్ఐ జె లక్ష్మయ్య (సిఎఆర్ కరీంనగర్), కానిస్టేబుల్ సిహెచ్ రాజేశం (కరీంనగర్ త్రీటౌన్) లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

పదవి విరమణ పొందిన పోలీసులకు పెన్షన్ పత్రాలతోపాటు, క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటి, భద్రత, ఎ.పి.జి.ఎల్.ఐ.సిలో జమ అయిన మొత్తాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్త్ర్రెనీ ఆర్.ఐ బి.గంగాధర్, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ టి.శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు యం. సురేందర్, ఉపాధ్యక్షులు సిహెచ్ సాగర్, సభ్యులు పండిరి తదితరులు పాల్గొన్నారు.

v.b kamalasan reddy....

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *