కన్నతండ్రే కాలయముడు..

కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటలో దారుణం జరిగింది. కన్నతండ్రే కూతురుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ మె ప్రతిఘటించడంతో చివరకు ఆమె చీరతో ఆమెకే ఉరివేసి చంపేశాడు. ఏమీ తెలియనట్టు ఎవరో దుండగులు వచ్చి నన్ను కొట్టి ఇలా చేశాడని నాటకమాడాడు.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఈ దారుణం వెలుగుచూసింది..

ఆషాఢమాసం కావడంతో కూతురు మౌనికను తండ్రి భూమల్ల మల్లయ్య తన ద్విచక్రవాహనంపై అత్తవారింటి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. అనంతరం కూతురును బండి మీద ఎక్కించుకొని దేశాయిపేట దాటుతుండగా అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. కూతురు ప్రతిఘటించడంతో ఆమెను చీరతో ఉరివేసి చంపి ఎవరో చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తండ్రే హంతకుడని తేల్చారు. దీంతో ఈ దారుణం వెలుగుచూసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *