
పంచదార బొమ్మ కాజల్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది తెలుగులో తన టెంపర్ ను త్వరలోనే చూపించ బోతోంది. యంగ్ టైగర్ హీరోగా నటించిన టెంపర్ జనవరి 20న రిలీజ్ కాబోతోంది. ఇందులో కాజల్ అందాల కనువిందే అంటున్నారు. ఆమె అభినయం కూడా అభిమానులకు నచ్చుతుందట. దీని తర్వాత ఈ సౌందర్య రాశి కొత్త సినిమాలేమీ ఈ ఏడాది తెలుగులో రీలీజ్ కావట.
తమిళంలో ధనుష్ సరసన మారి సినిమాలో నటిస్తోంది. అన్నిటికీ మించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే, ఈ అమ్మడు నటించిన రెండు కన్నడ సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్నాయి. చూడబోతే కాజల్ కన్నడ కస్తూరి నిక్ నేమ్ పెట్ట వచ్చేమో. కన్నడలో ఏకే 97, తథాస్తు అనే సినిమాల్లో కాజల్ అందాలు అదనపు ఆకర్షణ అవుతాయట.
తెలుగు తెరమీద అర విరిసిన మందారంలో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన కాజల్, ఎక్కువగా టాలీవుడ్ కే ప్రాధాన్యం ఇచ్చేది. మగధీరలో కెరీర్ టర్న్ అయిన తర్వాత అప్పుడప్పుడూ ఒక్కో తెలుగు పదం కూడా మాట్లాడటం నేర్చుకుంది. మధ్యలో కొంత కాలం తెలుగు సినిమాలే ఒప్పుకోక, బోలెడు రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు తన టెంపర్ చూపిన తర్వాత కోలీవుడ్, కన్నడ సినిమాలతో బిజీ బిజీ అవుతుంది. అంటే ఈ ఏడాదిలో ఈ అమ్మడు హైదరాబాదులో తళుక్కుమని మెరుస్తూ కనిపించే అవకాశాలు తక్కువే అన్న మాట.