Breaking News

కార్మికుల కనీస వేతనాలను సమీక్షించిన మంత్రి నాయిని నరసింహా రెడ్డి

కనీస వేతనాలను సమీక్షించిన మంత్రి నాయిని నరసింహా రెడ్డి

కార్మికులకు కనీస వేతనాలను కల్పించే వ్యవహారంపై రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి శ్రీ నాయిని నరసింహా రెడ్డి సచివాలయంలో బుదవారం నాడు సమీక్షించారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయెల్, కమీషనర్ అహ్మద్ నదీం, ఫ్యాప్సీ, సి.ఐ.ఐ., చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్మికులకు కనీసవేతనాలను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కనీసవేతనాల అమలు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలను సిద్దం చేయాలని మంత్రి ప్రతినిదులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే కార్మిక వర్గాలతోనూ త్వరలో సమావేశం కావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. యాజమాన్య వర్గాలతోనూ, కార్మిక వర్గాలతోనూ సమావేశమై అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ నష్టం కలగకుండా ఈ ప్రక్రియ ముగించాలని మంత్రి అన్నారు. కార్మికులతో పాటు, కంపెనీల యాజమాన్యాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతిపాదనలను మరో రెండు, మూడు రోజులలో సిద్దం చేస్తామని సమావేశానికి వచ్చిన ప్రతినిధులు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *