Breaking News

కదిలిన కాంగ్రెస్ దండు..

congress

-జిల్లాలకు పార్టీ సీనియర్ నేతలు
హైదరాబాద్, ప్రతినిధి : దిగ్విజయ్ పెట్టిన చీవాట్లు.. రాహుల్ చేసిన సూచనలు పనిచేస్తున్నాయి.. కాంగ్రెస్ నేతలు జిల్లాల బాట పడుతున్నారు. రోజురోజుకు వలసలతో దిగజారిపోతున్న కాంగ్రెస్ కు పునరుత్తేజమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు జిల్లాల్లో సమీక్షలు చేశారు. ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.

మెదక్ లో పొన్నాల, మహబూబ్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ లో డి.శ్రీనివాస్, వరంగల్ లో షబ్బీర్ అలీ, ఆదిలాబాద్ లో శ్రీధర్ బాబు, నిజామాబాద్ లో గీతారెడ్డి, నల్గొండలో జానారెడ్డి లు పాల్గొని కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఆయా జిల్లాలలో వారు మాట్లాడుతూ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించడంపై తెరాస ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. సీఎం అనుభవరాహిత్యంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. కానీ సీఎం మాత్రం ఆకాశంలో బిల్డింగ్ లు కడుతున్నారని విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *