కడియం శ్రీహరి నేతృత్వంలో…..

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలను కేంద్రం శ్లాఘించడమే కాకుండా…వాటి అమలులో భాగస్వాములైన తెలంగాణ ప్రభుత్వంలోని నేతలను కేంద్రం ప్రభుత్వం ఆయా కమిటీలకు చైర్మన్లుగా, మెంబర్లుగా నియమించి వారి సేవలను వినియోగించుకొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖలో బాలిక విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలను కేంద్రం గుర్తించింది.

దేశ స్థాయిలో కూడా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, బాలిక విద్యలోని వెనుకబాటుతనానికి కారణాలు తెలుసుకోవడం, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీర్ యాదవ్, సభ్య కార్యదర్శిగా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్‌ సభ్యులుగా ఉప సంఘాన్ని వేసింది. బాలిక విద్యపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొంది. బాలిక విద్య కు సరైన ప్రాధాన్యం లేకపోవడానికి వారి సామాజిక, ఆర్ధిక అంశాలు, లింగ వివక్ష వంటి ఎంతవరకు కారణాలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. విద్యలో లింగ వివక్షను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఈ కమిటీని కోరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రాథమకి, మాద్యమిక, ఉన్నత స్థాయిలో బాలికల నమోదు శాతం ఎలా ఉందో కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారిగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల నమోదును ఈ కమిటీ విశ్లేషించనుంది.

ముఖ్యంగా విద్యాలయాల్లో, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో బాలికలకు ఉన్న భద్రత, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈ భద్రత పెంపు అంశాన్ని, బాలికల విద్యాలయాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల వారి నమోదు శాతం తగ్గడం వంటి కీలక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏయే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నారో వాటన్నింటిని స్టడీ చేసి దేశంలో బాలికల విద్య పెంపొందించేందుకు ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించనుంది. ఏడాదిలోపు వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *