కడియం, వలస నేతలపై స్పీకర్ కు ఫిర్యాదు

హైదరాబాద్ : ఎంపీగా ఉండి రాజీనామా చేయని కడియం శ్రీహరితో పాటు టీడీపీ నుంచి మంత్రులుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ మంత్రులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికలకు భయపడే టీఆర్ఎస్ వారితో రాజీనామాలు చేయించడం లేదని.. వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి, తలసాని, తదితర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని స్పీకర్ ను కోరినట్టు రేవంత్ పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *