Breaking News

కడియం రికార్డును బద్దలు కొట్టిన పసునూరి

Pasunuri-Dayakar-Warangal-MP

వరంగల్ : అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కూడా కలలో కూడా ఊహించలేని ఫలితాన్ని ఇచ్చి షాక్ ఇచ్చారు వరంగల్ ప్రజలు.. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక లో గత రికార్డును టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4 లక్షల 59 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కు డిపాజిట్ గల్లంతు చేసింది..

గతంలో వరంగల్ లో ఎక్కువ మెజార్టీ సాధించిన రికార్డు కడియం శ్రీహరిపైన ఇప్పటివరకు ఉంది.2014 ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన కడియం 3,92,137 ఓట్ల మెజార్టీ సాధించగా.. ఇప్పుడు దయాకర్ 4లక్షల 59 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించాడు..

కాగా పసునూరి దేశంలోనే 7వ అత్యధిక మెజార్టీ సాధించిన నాయకుడిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *