
ఈనెల 17న ఒక పెద్ద న్యూస్ చెబుతా అంటూ ట్విట్టర్ లో పెద్ద సంచలనం సృష్టించిన మంత్రి కేటీఆర్ ఆ రహస్యాన్ని రిలీజ్ చేశారు. యాపిల్ సంస్థ హైదరాబాద్ లో యాపిల్స్ మ్యాప్స్ పెట్టడమే పెద్ద వార్త అంటూ యాపిల్ కు గులాబీ రంగు పూయించి స్పష్టం చేశారు.. కాగా కేటీఆర్ రహస్యం ఏంటి అంటూ చాలామంది ఆసక్తి కనబరిచారు. కొందరు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెబుతావా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు.
దీనికి కేటీఆర్ కూడా సరదాగా స్పందించారు.. ‘ఆ విషయం నాకు తెలియదు.. మా మిత్రుడు రానా దగ్గుబాటిని’ అడగండి అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దీనికి వెంటనే స్పందించిన రానా ’ ఆ బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేందుకు సినిమా తీస్తున్నామని’ ట్విట్టర్ స్పందించారు రానా..