కందిరైతులను ఆదుకోవడంలో కేంద్రం వైఫల్యం మంత్రులు హరీష్ రావు, పోచారం అసంతృప్తి.

కందిరైతులను ఆదుకోవడంలో కేంద్రం వైఫల్యం మంత్రులు హరీష్ రావు, పోచారం అసంతృప్తి.

కందిరైతులను ఆదుకోవడంలో కేంద్రం వైఫల్యం.

మంత్రులు హరీష్ రావు, పోచారం అసంతృప్తి.

ఇతర రాష్ట్రాల నుంచి కందుల దిగుమతికి అడ్డుకట్ట.

వ్యవసాయ,మార్కెటింగ్ అధికారులతో తనిఖీ బృందాలు.

తెలంగాణ రైతులకు మద్దతుధర కల్పించడంలో, కందుల సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రులు తీసుకు వస్తామని హరీశ్ రావు,పోచారం తీవ్ర అసంతృప్తి ని ప్రకటించారు. మంగళవారం ఇక్కడ బి.ఆర్.కే.భవన్ లో మార్కేటింగ్ హెడ్ క్వార్టర్ లో కందుల కొనుగోళ్ళ సమస్యపై సమీక్షించారు.కేంద్రం రైతు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నదని మంత్రులు మండిపడ్డారు. కందుల కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రం ఉదాసీనతపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు రాసిన లేఖలపై స్పందన లేనందుకు నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని మంత్రులు కోరారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షిమ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.రాష్ట్రంలో ఇప్పటికే 1.70 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినా, ఇంకా దాదాపు మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్ కు వస్తున్నట్టు చెప్పారు.కేవలం 75 వేల మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందుకు,కందుల కొనుగోళ్లలో పరిమితులు విధించినందుకు మంత్రులు హరీష్ రావు, పోచారం నిరసన తెలిపారు.కందుల కొనుగోలు సమస్యప ఈ నెల 15న ఢీల్లీలో మరోసారి కేంద్రం పై ఒత్తిడి తీసుకు వస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు తెలిపారు.కంది రైతుల బకాయిల చెల్లింపునకు గాను ప్రభుత్వం 600 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.అత్యంత త్వరగా కందిరైతుల బకాయిలు చెల్లించే విదంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్ధసారధి, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్ మోహన్ ను ఆదేశించారు.రాష్ట్రంలోనే కందుల దిగుబడి అనూహ్యంగా ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డి దోవన దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికార యంత్రాంగాన్ని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ,నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో జాయింట్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. మార్కెటింగ్ అధికార యంత్రాంగం క్రియాశీలంగా పని చేయాలని ఆయన ఆదేశించారు.మార్క్ ఫెడ్ ,హాకా వంటి ఏజెన్సీల అధికారులు ప్రతి రోజూ సాయంత్రానికి కందుల క్రయవిక్రయాలను సమీక్షించాలని ఆదేశించారు.ఆకస్మిఖ తనిఖీలు నిర్వహించాలని కోరారు.కొనుగోలు కేంద్రాల దగ్గర దీర్ఘకాలంగా పనిచేసే సిబ్బందిని తరచూ ఇతర కొనుగోలు కేంద్రాలకు మార్చాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

నారాయణఖేడ్,నల్లగొండ,వికారాబాద్ వంటి ప్రాంతాల్లో రైతుల ముసుగులో కందుల అమ్మకాలు జరిపిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.వారు తీసుకు వచ్చిన కందులను జప్తు చేసినట్టు కూడా హరీష్ రావు చెప్పారు.ఇలాంటి అక్రమాలకూ పాల్పడే వ్యక్తులపై కటిన చర్యాలు తీసుకోవాలని కోరారు.ఇకపై స్థానిక వ్యవసాయ అధికారులు వెరిఫై చేసి ధ్రువ పత్రం ఇచ్చిన తర్వాతే సరుకులను కొనుగోలు చేయాలని, అలాగే వారికి పేమెంటు చేసే సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హరీష్ రావు ఆదేశించారు.10 క్వింటాళ్ళకు పైగా కందులను మార్కెట్ కు తీసుకు వచ్చె వారిపై నిఘా పెట్టాలని కోరారు. రైతుల ముసుగులో అక్రమాలకూ పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్ధసారధి, కమిషనర్ జగన్ మోహన్. మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, మార్క్ ఫెడ్, హాకా, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *