
-కందిపప్పు అక్రమ నిల్వ దారులపై కేంద్రం దాడులు, కందిపప్పు స్వాధీనం
ఢిల్లీ : కేంద్రం కందిపప్పు ధరలు చక్కలనంటుతున్న వేళ వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వఉంచిన వ్యాపారుల గోదాంలపై విస్తృతంగా దాడులు చేస్తోంది.. శుక్రవారం మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, హరియాణాల్లో వ్యాపారుల దుకాణాలపై దాడులు చేసి 15335 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకుంది.. ఇప్పటివరకు మొత్తం 50 వేలకు పైగా ధాన్యంను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదంతా దిగుమతి చేసుకొని అక్రమంగా నిల్వ ఉంచిందే అని అధికారులు తేల్చారు.
కాగా కందిపప్పు ధర మార్కెట్లో చుక్కలనంటుతూనే ఉంది.. కిలో రూ.210 ధర పలుకుతోంది.. చికెన్ ధరలేమో కిలోకి రూ.90కి దిగివచ్చాయి.. దీంతో జనం కందిపప్పును వదిలేసి చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.