
ఉప్పు, నిప్పులా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసిపోయారు. ఒకరి మించి మరొకరు అప్యాయంగా మాట్లాడుకున్నారు. అమరావతి శంకుస్థాపన మహోత్సవం కేసీఆర్, చంద్రబాబులను కలిపేసింది. దీంతో తెలంగాణ ఏర్పడ్డప్పటినుంచి సాగుతున్న వివాదం ముగిసిపోయింది.. దీంతో అందరి కండ్లు చల్లబడ్డాయి..
ఇన్నాళ్లు ఓటుకు నోటు తదితర వివాదాలతో ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకున్న టీఆర్ఎస్ టీడీపీ నాయకులు కూడా ఇద్దరు సీఎంల భేటి ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో కొంత వేడి తగ్గించారు. దూషణలకు స్వస్తి పలికారు.దీంతో తెలుగు రాష్ట్రాల్లో సహృద్భావ వాతావరణం నెలకొంది..
సీఎం కేసీఆర్ అమరావతి పర్యటన ఖరారు కావడంతో ఇక మనస్పర్ధలు రెండు రాష్ట్రాల మధ్య తొలిగిపోయినట్టే కనపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో టీడీపీపై ఈగవాలనీయని టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ లు కొంచెం తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్టకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటాయి.. వీరు మళ్లీ వివాదాలు సృష్టించవద్దని అందరం కోరుకుందాం.. చంద్రబాబు కూడా కేసీఆర్ తో భేటి తరువాత లొల్లి వద్దని వీరికి చెబితే బాగుంటది..
చాలా రోజుల తర్వాత కేసీఆర్ చంద్రబాబుల ను ఒక్కటిగా చూసే సరికి మీడియాలో అదోపెద్ద న్యూస్ అయ్యింది.. తెలుగు ప్రజల కండ్లు సల్లవడ్డయి..