
హైదరాబాద్, ప్రతినిధి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయి.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోని ఉన్న కంటోన్మెంట్ లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతి పెద్దది. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 8 వార్డులు.. లక్షా 60 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 187 పోలింగ్ స్టేషనులను ఏర్పాటు చేశారు. రసూల్ పురాలో 15 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొదటగా మాక్ పోలింగ్ జరుగనుంది. 114 మంది పోటీలో ఉన్నారు. మూడు వార్డులను మహిళలకు కేటాయించగా, ఒక వార్డును ఎస్సీకి కేటాయించారు.
ఈ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కూతురు, కుమారుడు పోటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 52 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి.