కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి గ్రామాల వారిగా మెడికల్ టీం లు

కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి గ్రామాల వారిగా మెడికల్ టీం లు పర్యటించే షెడ్యూల్డు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.

మంగళవారం సచివాలయంనుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో కంటివెలుగు, సాధారణ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, హరితహారంపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, సిఈఓ రజత్ కుమార్, వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, కమీషనర్ కరుణ, పిసిసిఎఫ్ పి.కె.ఝా, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాలలో విజయవంతంగా నిర్వహించే నిమిత్తం మంత్రులు, ప్రజాప్రతినిదులతో సమన్వయం చేసుకొని పూర్వజిల్లా కేంద్రాలలో జిల్లాల స్ధాయి సమావేశాలు ఆగస్టు మొదటి వారం లోగా నిర్వహించాలని సి.యస్ కోరారు. ఈ విషయమై ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఆగస్టు 15 న ప్రారంభమయ్యే గ్రామాలను నిర్ణయించి, మెడికల్ టీం లను సిద్ధం చేసి ఆ ప్రాంతాలను ముందుగానే తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా చూడాలని, కంటివెలుగు శిభిరాల షెడ్యూలు పై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 900 మంది మెడికల్ ఆఫీసర్లను నియమించి జిల్లాలకు కేటాయించామని, వారిసేవలు వినియోగించుకోవాలని, అవసరమైన ఆప్టిమెట్రిక్స్ ను నియమించుకొని, సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను కోరారు. ప్రతి టీం లో మెడికల్ ఆఫీసర్, ఆప్టిమెట్రిక్ తప్పనిసరిగా ఉండాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని పరీక్ష చేసేలా చూడాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని, తగినన్ని కళ్ళజోళ్ళను పంపించామని, రాష్ట్ర వ్యాప్తంగా 113 ఆసుపత్రులను గుర్తించామని, కలెక్టర్లకు సూచించారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షిస్తామని ఆమె తెలిపారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్న నేపధ్యంలో అవసరమైన ఏర్పాట్లపై సి.యస్, ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ కలెక్టర్లతో సమీక్షించారు. ఈ విషయమై ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ ఆదేశాల ప్రకారం ఒటర్ల జాబితా సవరణకు సంబంధించి హౌజ్ ఓల్డ్ సర్వే మే 21 న ప్రారంభించి జూన్ 30 న పూర్తి చేశామని పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ పూర్తి చేయవలసిఉందన్నారు. సెప్టెంబర్ లో డ్రాప్ట్ ఓటరు జాబితాను పబ్లిష్ చేసి అక్టోబర్ 30 నాటికి ఫిర్యాదులను స్వీకరిస్తామని, నవంబర్ 30 నాటికి అవసరమైన సవరణలు చేస్తామన్నారు. సవరణ అనంతరం ఫైనల్ రోల్స్ పబ్లిష్ అవుతుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, హేతుబద్ధీకరణ బోగస్ ఓటర్ల తొలగింపు, నూతన ఓటర్ల జాబితా తయారీ, చనిపోయిన ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్ లో ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుతో పాటు వారిని ఓటర్లుగా నమోదు చేయటానికి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. EVMS,VV Pats(Voter Verfiable Paper Audit Trail System) నిల్వ చేయటానికి అవసరమైన గోడౌన్స్ ను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలలో EROలు, AERO లుగా అధికారులను నియమించాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహించాలని,సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఓటర్ల జాబితాలపై ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని, ఎన్నికల నియమావళి, నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. EVMS, VV Pats పనితీరుపై ప్రజలకు తెలియచెప్పాలన్నారు. నాలుగో విడత హరితహారంలో భాగంగా రేపు గజ్వేల్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు లక్షా నూటపదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి తెలిపారు. ఆకు పచ్చ తెలంగాణ సాధన దిశగా అందరూ పునరంకితం కావాలని సీ.ఎస్ పిలుపు నిచ్చారు. హరితహారం అమలు అవుతున్న తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల ఆరంభం నుంచీ హరితహారం కొనసాగుతోందని, సి.ఎం గజ్వేల్ లో మొక్కలు నాటుతున్న రోజు మిగతా జిల్లాల్లో కూడా మంత్రులు, స్థానిక ప్రాజా ప్రతినిధులతో మొక్కలు నాటడం, వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. కేవలం సంఖ్య కోసం, టార్గెట్లు చేరుకోవటం కోసం కాకుండా, పచ్చదనం, పర్యావరణం కోసం ముఖ్యమంత్రి తపిస్తున్నఉద్దేశ్యాన్ని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఆదిశగా హరితహారం అమలులో ఏదశలోనూ ఏమరు పాటుగా ఉండొద్దని అధికార యంత్రాంగానికి సి.ఎస్ సూచించారు. మొక్కలు నాటడం ఏంత ముఖ్యమో, వాటికి తగిన నీటి వసతి ఏర్పాటుచేయటం, జియో ట్యాగింగ్ చేయటం కూడా అంతే ప్రాధాన్యతగా గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాలు, నాటిన మొక్కలను జియో ట్యాంగింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ చేసిన వాటికే ఉపాధి హామీ నిధుల విడుదల జరుగుతుందని తెలిపారు. మొక్కలు నాటే విధానం, సంరక్షించే పద్దతులు, సమాజంలో ప్రతీ ఒక్కరి పాత్రపై అటవీ శాఖ, విద్యాశాఖలు అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాయని, రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, ప్రతీ పాఠశాలకు స్వచ్చ పాఠశాల- హరిత పాఠశాల నినాదం చేరేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. వచ్చే యేడాది వంద కోట్ల లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచేందుకు ప్రతీ గ్రామ పంచాయితీ పరిధిలో ఒక నర్సరీని ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని సి.ఎస్ ఆదేశించారు.

sk joshi 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *