Breaking News

కంటతడి పెట్టిన ‘పొన్నాల’

-కాంగ్రెస్ ధర్నాలో పోలీసుల దౌర్జన్యం
-పొన్నాల భుజంకు తీవ్ర గాయం
హైదరాబాద్,ప్రతినిధి : సచివాలయం తరలింపుపై హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులు చేసిన పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దొరికొన్నళ్లను దొరికినట్టు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తోపులాటలో పొన్నాల లక్ష్మయ్య భుజంకు తీవ్రగాయమైంది. పోలీసులు తనపై దౌర్జాన్యానికి పాల్పడ్డారని పొన్నాల రోడ్డుపైనే బైటాయించి కంటతడి పెట్టారు.

తమకు గవర్నర్ అప్పాయింట్ మెంటు ఉన్నా కూడా పోలీసులు దౌర్జాన్యం చేశారని ఆయన ఏడుస్తూ ఆవేదన చెందారు. అనంతరం పోలీసులు పొన్నాలను ఆస్పత్రికి తరలించాలని చూసినా , ఆయన పోలీసుల తీరుకు నిరసనగా అక్కడే బైటాయించారు. చివరకు జానారెడ్డి అక్కడికి చేరుకుని పొన్నాలను ఓదార్చి, నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.

కాగా కాంగ్రెస్ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించి, పొన్నాలకు గాయం చేసినందుకు ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసు ఏసీపీని సస్పెండ్  చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *