
కంచె ఐలయ్య చేసిన బ్రాహ్మణ వ్యతిరేక వ్యాఖ్యల నేపధ్యం లో బ్రాహ్మణ పెద్దల సూచన మేరకు ఒక బ్రాహ్మణ ప్రతినిధి బృందం కంచె ఐలయ్యను కలిసి ఇటువంటి వ్యాఖ్యలపట్ల నిరసన వ్యక్తంచేసింది.భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించిదని తనకు బ్రాహ్మణులపట్ల బ్రాహ్మణ జాతి పట్ల పూర్తి గౌరవం ఉన్నదని , బ్రాహ్మణులను సోమరులు గా వ్యాఖ్యానించె కుసంస్కారం తనకు లేదని, తాను ఉత్పత్తిలో జాతుల పాత్ర గురించి మాత్రమే మాట్లాడనని,ఆపత్రికలోని కొంతమంది వ్యక్తులు కులాలమధ్య చిచ్చుపెట్టె ఉద్దేశం తోనే ఈరకమైన వక్రీకరణ చేస్తున్నారని పత్రిక యాజమాన్యాన్నివారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.ఈవ్యవహారంలో బ్రాహ్మణల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారందరినీ క్షమాపణలు కోరుతున్నాను అన్నారు.సమాజంలోని ప్రతి అనర్ధానికి బ్రాహ్మణులను బాధ్యులుగా చేసి బ్రాహ్మణజాతిని నిందించటం మానుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని బ్రాహ్మణ ప్రతినిధులు ఐలయ్యను హెచ్చరించారు. ఆసమయానికి అందుబాటులో వున్న ప్రతినిధులుగా శ్రీ దర్శనం వెంకటరమణ శర్మ (ఎం వీ ఆర్ శర్మ ) , శ్రీ యాదగిరి రావుగారు., మంగపతిరావు, ఈశ్వరగారి రమణ గారు ,శేషశర్మ -సత్యసుధ దంపతులు ,మల్లాది శర్మగారూ ,భరత్ తదితరులు మా బృందంలో ఉన్నారు.