ఔట్ లుక్ మ్యాగజైన్ కు స్మిత సభర్వాల్ నోటీసులు

PcxYKtL

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అడిషనల్ సెక్రటరీ , ఐఏఎస్ స్మిత సభర్వాల్ ఔట్ లుక్ మ్యాగజైన్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగేలా.. తనను కించపరిచేలా.. తనను అవమానించేలా కథనం ప్రచురించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై సీఎస్ రాజీవ్ శర్మ కూడా సీరియస్ అయ్యారు. ఔట్ లుక్ మ్యాగజైన్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

కాగా ఔట్ లుక్ పత్రికలో సీఎంవో స్మిత సభర్వాల్ సెక్సీయెస్ట్ లేడీ అంటూ అసభ్యకరంగా కథనంతో కార్టూన్ ప్రచురించారు. ఆమె జీన్స్, టాప్  వేసుకొని క్యాట్ వాక్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ ఇద్దరు నాయకులు ఆమె అందచందాలు చూస్తున్నట్టుగా కార్టున్ ప్రచురించడం వివాదానికి కారణం. ఇందులో స్మిత ఫ్యాషన్ పోకడలతో కనువిందుచేస్తోందని.. ఆమె వయసుకు తగ్గ జాబ్ కాదని.. ఆమె కట్టబొట్టుపై ఔట్ లుక్ పత్రిక అసభ్యకర కథనం ప్రచురించింది. దీనిపై స్మిత సీరియస్ గా రియాక్ట్ అయి నోటీసులు పంపింది.

స్మితపై అసభ్యకరంగా ఔట్ లుక్ మ్యాగజైన్ వేసిన కార్టూన్

స్మితపై అసభ్యకరంగా ఔట్ లుక్ మ్యాగజైన్ వేసిన కార్టూన్ ఇదే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *