Breaking News

ఔట్ లుక్ కథనం భారత మహిళలందర్ని అవమానించింది..

smita-barkha_022

‘భారత దేశంలో మహిళలకు చాలా గౌరవముంది. కానీ కొంతమంది ఎల్లో జర్నలిజం ముసుగులో మహిళల్ని కించపరుస్తున్నారు. ఎన్నికుట్రలు చేసినా మా సైర్థ్యం దెబ్బతీయలేరు. చట్టపరంగా ఔట్ లుక్ ను కోర్టుకీడుస్తా..’ అంటూ తెలంగాణ ఐఏఎస్, సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మిత సభర్వాల్ మండిపడ్డారు. నేషనల్ చానల్ ఎన్డీటీవీతో ఆమె మాట్లాడారు.

ఐఏఎస్ లపైనే ఇలాంటి అనుచిత కథనాలు ప్రచురించడం దారుణమని .. తమ పర్సనల్ లైఫ్ ను బట్టి వ్యక్తిత్వాన్ని కించపరచడమే తమ హక్కుల్ని కాలరాయడమేనన్నారు. బాగా చదువుకుని , తల్లిదండ్రులు, ప్రజల ఆశయాల్ని నెరవేర్చే బాధ్యతాయుత పదవి ఐఏఎస్ గా పూర్తి చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నానని.. 14 ఏళ్ల కెరీర్ లో తాను ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రధాని చేతులమీదుగా అవార్డు ఉన్న చరిత్రనాది అని అటువంటి నాపై ఔట్ లుక్ దిగజారే కథనం ప్రచురించడాన్ని స్మిత ఖండించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *