ఓ సామాన్యుడి ఆవేదన

నువ్వు అసెంబ్లీ ల చెప్పిన మాటలు లవ్ గమ్మత్ అనిపిచ్చినయే ! సూపర్ జెప్పినవ్ మల్ల !

మాది ఉద్యోగుల ప్రభుత్వం, 43% జీతాలు పెంచినమంటివి, మీరు పెంచుకున్న 200% చెప్పకపోయినవెంద్దే ?

9నెలల PRC బకాయిలు ఇంతవరకు ఇయ్యని సంగతి మరిచిపోయినట్లువన్న ! ఓహో పైసలు లేవా ? లేకపోతే మరి దేశం లొనే అత్యధిక వేతనాలు పొందుతుంది మన MLA, మన మంత్రులు , మన ముఖ్యమంత్రి కదనే !

మీ రాజకీయ జాతి రకరకాల గిమ్మిక్కులు చేసి, రిగ్గింగులు చేసి, భయపెట్టి, ప్రలోభపెట్టి ఒక్కసారి ఎన్నికయితేనే జీవితాంతం పెన్షన్, సకల రాజభోగలు, పెండ్లాముకు పెన్షన్
ఇచ్చుకుంటారు కదే !

కానీ కష్టపడి చదివి, పది రకాల పరీక్షలు వ్రాసి ఉద్యోగం సంపాదించి, 20 — 30 ఏండ్లు మీకు గొడ్డు చాకిరీ చేసినందుకు కృతజ్ఞత ( gratuty ) ఇవ్వలేర ? మా పైసలు మార్కెట్ లో పెట్టి జూడమాడి, మాల్యలాంటి దొంగలకు మొండి చేయి చూపెడతార ? మా పెండ్లాం, పిల్లల గతేమ్ కావాలా ?

అయినా మనది ఉద్యోగుల డొస్తానా ప్రభుత్వం కదా ? సర్వీస్ రూల్స్ అయిపోయినాయ రాజన్న ? DA ఇస్తే కూడా మా MLC లు గొప్పగా చెప్పుకొనే విధంగా కీలు బొమ్మలను చేసారు కదా మీరు. అయినా మనది employee friendly ప్రభుత్వం కాదే రాజన్న !

౼౼ తెలంగాణ రాజిగాడు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.