ఓవర్ లోడ్ తో వెళ్తే చర్యలు..

ఓవర్ లోడ్ తో వెళ్తే చర్యలు..

ఓవర్ లోడ్తో వెళ్ళే వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా వాహనాల నియంత్రణ కమిటి ఛైర్మన్, కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. పరిమితికి మించి వాహనాలు వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా వాహనాల నియంత్రణ కమిటి సమావేశం బుధవారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో జరిగింది. ఈ సందర్భంగా కమిటి ఛైర్మన్, పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బస్టాప్ లలో ప్రయాణీకులు కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్సులు నిలుపు స్ధలాల్లో శాశ్వత బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అనుమతిలేని ప్రదేశాల్లో పార్కింగ్ లను నియంత్రించాలని తెలిపారు. లైసెన్సులు లేకుండా నడిపే వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు నియమ నిబంధనలు విస్మరించే వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి తనిఖీలను చేపట్లాలని ఆదేశించారు. సమావేశం అనంతరం సంబంధిత అధికారులు నగరంలోని బస్టాప్ లను సందర్శించి సౌకర్యాల కల్పలకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్ టిసి రీజినల్ మేనేజర్ చంద్రనాధ్, డిపో మేనేజర్ ధర్మా, డివియం రవికుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి వినోద్ కుమార్, డిప్యూటి డియంఅండ్ హెచ్ వో డాక్టర్ జి. రవికుమార్ ట్రాఫిక్ ఎసిపి అశోక్ కుమార్, ఇన్స్ పెక్టర్లు మహేష్ గౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ కేంద్రాల్లో ట్త్ర్రెనింగ్ ను పరిశీలించిన ఐజి..
జిల్లా కేంద్రంలోని సిటి పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి), పోలీస్ ట్త్ర్రెనింగ్ కళాశాల (పిటిసి)లలో జరుగుతున్న శిక్షణలను బుధవారం నాడు ట్త్ర్రెనింగ్ ఐజిపి కె.శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రాల్లో సంఘటనల నియంత్రణకు పలు సూచనలు చేశారు. తొలుత ఆయన కమీషనరేట్ కేంద్రంలో గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి, సిపిటిసి ఇంఛార్జి ప్రిన్సిపాల్ టి.అన్నపూర్ణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *