ఓల్డ్ ఏజ్ హోమ్ లో దారుణాలు….

హైదరాబాద్‌ శివార్లలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎవరికీ అనుమానం రాని రీతిలో దారుణాలు బయటపడుతున్నాయి. బాధితులు బయటకు చెబితే తప్ప.. ఎవరూ నమ్మలేని స్థాయిలో ఈ దందా సాగుతోంది. అవి ఎక్కడ అనుకుంటున్నారా. వాళ్లు పైకి చెప్పేవి నీతులు.. బయటకు సంఘసంస్కర్తల్లా బోర్డులు.. లోపల జరిగేవి అసాంఘిక కార్యకలాపాలు.. వాళ్లు పైకి నీతులు చెబుతారు. బయటకు సంఘసంస్కర్తల్లా బోర్డులు పెట్టుకుంటారు. కానీ.. లోపల జరిగేవి అసాంఘిక కార్యకలాపాలు. పలుకుబడి ఉందికదా అని చెలరేగిపోతున్నారు.. రాజకీయ, ఆర్థిక అండ చూసుకొని విర్రవీగుతున్నారు.. అరాచకాలు బయటపడితే కానీ.. బండారం బట్టబయలు కావడం లేదు. పలుకుబడి ఉందికదా అని చెలరేగిపోతున్నారు. రాజకీయ, ఆర్థిక అండ చూసుకొని విర్రవీగిపోతున్నారు. అరాచకాలు బయటపడితే కానీ.. ఇలాంటి వాటి బండారం బట్టబయలు కావడం లేదు. బయటకు కనిపించేవి వేరు. లోపల జరిగే అరాచకాలు వేరు అవే ఓల్డ్ ఏజ్ హోమ్ లు. నగర శివారులో పుట్టుగోడుగుల పుట్టుకోస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ లు ఇక హైదరాబాద్‌ శివారులో జరిగిన అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. తెలియని వాళ్లు అక్కడి పరిస్థితి చూస్తే నమ్మని స్థాయిలో ఘోరాలు జరుగుతున్నాయి. అవే ఓల్డ్ ఏజ్ హోమ్ లు. పేరుకే అవి ఓల్డ్ ఏజ్ హోమ్ లు. కానీ లోపల జరిగేవి మాత్రం ఆసాంఘిక కార్యక్రమాలు. ఇటీవల బండ్లగూడలోని రామకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ దారుణం చోటు చేసుకుంది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పని చేస్తున్న పదహారేళ్ల మైనర్ బాలికపై సూపర్ వైజర్ గా పని చేస్తున్న గణేశ్ అనే వ్యక్తి పార్కింగ్ చేసి ఉన్న కారులో ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఇదే హోమ్ లో పని చేస్తున్న సుబ్బయ్య, వెంకటేష్ కూడా ఆ బాలికపై ఆత్యాచారయత్నం చేశారు. అప్పట్లో ఈ సంఘటన నగరంల్ సంచలనం సృష్టించింది. తాజాగా ఎల్బీనగర్ నాగోల్ లోని అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో దారుణం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముగ్గురు పేర్లు… మాణిక్యం, శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్. మాణిక్యం తోపాటు శ్రీనివాస్ రెడ్డి కలిసి అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఇంకేముంది బయటికి మాత్రం ఏదో సంఘ సేవ చేస్తున్నట్లు బిల్డప్. లోపల మాత్రం ఆసాంఘిక కార్యక్రమాలకు తెర లేపారు. అదే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పని చేస్తున్న ఓ మైనర్ బాలికపై మాణిక్యం, శ్రీనివాస్ రెడ్డి తోపాటు వేణుగోపాల్ లు అత్యాచారం చేశారు. ఆసంఘటనపై బాదితరాలు ఎల్బీనగర్ పిఎస్ లో పిర్యాదు చేసింది. అత్యాచార విషయం ఎవరికైనా చెబితే నీతో పాటు ని కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాకినాడకు చెందిన ఈ బాలిక గత మూడు సంవత్సరాలుగా అక్షయ ఓల్డ్ ఏజ్ హోంలో కిచెన్ హెల్పర్ గా పనిచేస్తుంది. శంకర్( బాధితురాలి బంధువు) . ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్ రావు తెలిపారు. ప్రస్తుతం ముగ్గరు నిందితులు పరారీలో ఉన్నారని… త్వరలనే అరెస్ట్ చేస్తామన్నారు. ఎల్బీనగర్. ఏసీపీ వేణుగోపాల్ రావు. అయితే హైదరాబాద్ లో రోజురోజుకు పుట్టగోడులా పుట్టుకోస్తున్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లు. ఓల్డ్ ఏజ్ హోమ్ లు ఏర్పాటు చేయాలంటే సవాలక్ష పర్మీషన్ లు తీసుకోవాలి ప్రభుత్వ డిపార్టుమెంట్ల నుంచి. కానీ కొందరు వ్యక్తులు మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకుని నడుపుతుండగా… మరికొందరు మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ లు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ల పేరుతో కొందరు డబ్బులు సంపాదిస్తుండగా… మరికొందరు ఆసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణ. సిటీలో ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లు ఉన్నాయో అధికారుల వద్దే లేక్కలు లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *