ఓరుగల్లు, ఖమ్మంలో టీఆర్ఎస్ ప్రభంజనమే..

– వరంగల్ లో 45-52, ఖమ్మంలో 35-40 కు పైగా సీట్లు
-అధికారపార్టీ ఖాతాలో మరో రెండు కార్పొరేషన్లు
-పొలిటికల్ ఫ్యాక్టరీ సర్వేలో వెల్లడైన వివరాలివీ..
వరంగల్ : ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురే లేకుండా పోతోంది. ఇంతటి దుర్భిక్ష కరువులో సైతం జనం ప్రభుత్వ పాలనకు జై కొడుతున్నారంటే.. ఇక సరిగ్గా వర్షాలు పడి.. పంటలు పండి.. ప్రభుత్వ పథకాలు అందితే మరో 20 ఏళ్ల వరకు కేసీఆరే సీఎం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే జనంలో ప్రబలిపోయింది. టీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ.. ఈ ప్రభుత్వం మనది అన్న భావన ప్రతి వ్యక్తిలోనూ ఇమిడిపోయింది. కులాలు, మతాలు అన్న తేడా లేకుండా కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ది అందరి గడపగడపకు చేరుతోంది. నాయకులకు, ప్రజలకు సమ న్యాయం దక్కుతోంది. అందుకే కేసీఆర్ పాలను ప్రతి ఎన్నికల్లోనూ జనం జేజేలు పలుకుతున్నారు. అనామకులు కారుగుర్తుపై నిలబడ్డా గెలిపిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ దక్కిందంటే చాలు గెలుపు ఖాయమన్న ధీమా అభ్యర్థుల్లో నెలకొందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు అందరూ టీఆర్ఎస్ టికెట్ కోసం నాయకులు, కేసీఆర్ చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నారు..

కాగా ఇటీవల ఎన్నికలు పూర్తయిన ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్లలో గులాబీ హవా కొనసాగనుంది. పొలిటికల్ ఫ్యాక్టరీ సర్వేలో టీఆర్ఎస్ కు మెజార్టీ కి పైగా సీట్లు వస్తాయని తేలింది. ప్రతిపక్షాలకు 10 లోపే సీట్లు వస్తాయని స్పష్టమైంది. వరంగల్ లో టీఆర్ఎస్ కు 45-52 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. అలాగే ఖమ్మంలో 35-40సీట్లు టీఆర్ఎస్ గెలుపొందే అవకాశాలున్నాయి.. సర్వేలో జనం కేసీఆర్ ప్రభుత్వానికే మద్దతు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని.. ఓట్లు అధికారపార్టీ కే వేశారు.

కాగా పాలన ఇలానే కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీనే గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యమ పార్టీ ఉద్యమంలా అభివృద్ధి చేస్తుండడతో జనం ఆ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. అన్నిరంగాల్లో బంగారు తెలంగాణ కోసం ముందుకెళ్తు న్న కేసీఆర్ కు ఈ ఊపు మరింత ఉత్సాహానిస్తుందనడంలో సందేహం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *