Breaking News

ఓరుగల్లు కాబోతోంది.. మరో ఐటీ సిటీ

warangal1

తెలంగాణలో హైదరాబాద్ తరువాత మరో ఐటీ సిటీ వరంగల్ కాబోతోంది. ఈమేరకు అడుగులు వేస్తోంది సర్కారు.. హైదరాబాద్ వెలుపల ఐటీని విస్తరించాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ లో మరో టీ హబ్ ఏర్పాటుకు అధికారులు నిర్నయించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరమైన వరంగల్ లోని ఎన్ఐటీలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఎన్ఐటీకి బిజినెస్ ఇంక్యూబేషన్ కేంద్రాన్ని కేటాయించింది. దీంతో ఐటీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం వరంగల్ లో మరో టీ హబ్ , దాంతో పాటు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఇక్కడ ఏర్పాటు చేసే సైయెంట్ ఇంక్యూబిటర్ను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *