ఓరుగల్లులో వికసించేది గులాబీయే..

telangana-trs

ఓరుగల్లులో ఈసాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది.. 2014 ఎన్నికలతో పోల్చితే 7శాతం పోలింగ్ తగ్గింది. ఈసారి వరంగల్ ఉప ఎన్నికల్లో 69.01శాతం పోలింగ్ నమోదైంది. కాగా టీఆర్ఎస్ ఏడాది పాలనకు ఇది ఖచ్చితంగా రెఫరెండం లాంటి ఎన్నికల్లో ఈ నేపథ్యంలోనే మంత్రులందరూ తలా ఒక నియోజకవర్గంలో ప్రచారం చేసి టీఆర్ఎస్ కు ఊపు తెచ్చారు. కేసీఆర్ సైతం వరంగల్ లో సభలో ప్రచారం చేశారు.

ఇక కాంగ్రెస్ జాతీయ రాష్ట్రీయ నేతలందరూ మకాం వేసి హోరెత్తించారు. బీజేపీ,టీడీపీలు విస్తృతంగ ప్రచారం చేశాయి. కానీ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే సంకేతాలు కనపడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వరంగల్ లో టీఆర్ఎస్ కే విజయావకాశాలున్నట్టు తెలుపుతున్నాయి..

కాగా మెజార్టీ గతంలో కడియం శ్రీహరికి 3.92లక్షలు వచ్చింది. ఈసారి కొంచెం తగ్గినా కూడా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తిపోయడానికి సిద్దమవుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీలు గెలవడం అసాధ్యమైనా టీఆర్ఎస్ మెజార్టీని ఎంతమేరకు తగ్గిస్తాయో వేచిచూడాలి. ఇక బీజేపీ కి డిపాజిట్ వస్తుందా అన్న సంశయం కూడా మొదలైంది. స్థానికేతర ముక్కు మొహం తెలియని అభ్యర్థి కావడంతో బీజేపీపై డిపాజిట్ బాధ నెలకొంది. 24 న గానీ ఎవరి మెజార్టీ ఎంత.? విజయం ఎవరిదనేది తేలనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *