ఓరుగల్లులో టీడీపీ ‘ఉనికి’ పాట్లు?

Errabelli-Dayakar-Rao

ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీడీపీ శాసనసభాపక్ష నేత.. ప్రాతినిధ్యం వహించేంది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా నిలిచి గెలిచిన వీరుడు.. కానీ ఇప్పుడా వీరత్వం పనికిరాకుండా పోయింది.. వరంగల్ ఉప ఎన్నికల్లో వరంగల్ లో అసలు టీడీపీ ఉనికే లేకుండా పోయింది.. కారణం అక్కడ టీడీపీ నుంచి సొంతంగా పోటీ లేకపోవడమే..

వరంగల్ ఎస్సీ స్థానంను టీడీపీ తన మిత్రపక్షం బీజేపీకి వదిలేసింది.. బీజేపీకి అసలు కార్యకర్తల బలమే లేదు. కాస్తాకూస్తో ఉన్న టీడీపీ తరఫున ఎవరూ నిలబడలేదు. బీజేపీకి క్షేత్రస్థాయిలో టీడీపీ మద్దతు కష్టమే అలాంటి సమయంలో వరంగల్ ఉప ఎన్నికలో గెలుస్తాం అన్న ధీమా బీజేపీలో చచ్చుబడిపోయింది.

టీడీపీ అస్త్ర సన్యాసంకు తోడు.. బీజేపీ తరఫున ఎవరో ముక్కు మొహం లేని దేవయ్యకు టికెట్ ఇచ్చి బీజేపీ ఘోరమైన తప్పిదం చేసింది. దేవయ్య మిగతా టీఆర్ఎస్ కు పోటీ నిస్తుందా అని సగటు వరంగల్ అభిమాని ప్రశ్నిస్తున్నారు. ఎర్రబెల్లి కూడా బీజేపీ అభ్యర్థిని తమ అభ్యర్థి కానట్టు పట్టించుకోవడం లేదు. దీంతో ఓరుగల్లులో ఎన్డీఏ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

ఇక టీడీపీ ని చంద్రబాబు పోటీలో నిలపకుండా బీజేపీకి స్థానం ఇచ్చేసి తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. దీంతో వరంగల్ లో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *