ఓపికకు మారు పేరు స్త్ర్రీ – మహిళల పాత్ర గొప్పది

కరీంనగర్: ఏ ప్రాంతమైన, కుటుంబమైన, ఆర్ధిక, సామాజిక రంగాల అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పదని, ఓపికకు మారు పేరు స్త్ర్రీ అని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రువారం తిమ్మాపూర్ ఎం.పి.డి.ఒ. కార్యాలయ ఆవరణలో 32 లక్షలతో నిర్మించిన స్త్ర్రీ శక్తి భవన ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, నేడు అన్నిరంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతున్నారని, పొదుపును ప్రారంభించిన మహిళలు నేడు బ్యాంకులు ద్వారా కోట్లాది రూపాయలు వడ్డీలేని రుణాలు తీసుకుంటున్నారని, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఝాన్సీ రుద్రమదేవి, సమ్మక్క -సారలమ్మ, చాకలి ఐలమ్మలకు స్ఫూర్తిదాయకంగా మహిళలు రాణించాలన్నారు. ఆడ, మగ పిల్లలను సమానంగా చూడాలని ఆయన వివరించారు. డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రక్షణ, గగణతలానికి మహిళలు ఎదిగారన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకులు కోట్లాది రూపాయలు రుణాలు అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని, సమాన హక్కులు కల్పించాలని, ఆడ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు.వర్షాల కోసం మహిళలు పూజలు నిర్వహించాలని, రాష్ట్ర్రాభివృద్ధిని ఆకాంక్షించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆడపిల్లల కోసం గురుకుల పాఠశాల లను మంజూరు చేశారని ఆమె తెలిపారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసన సభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, తన నియోజక వర్గంలో వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం చేపట్టే గ్రామాల్లో నియోజకవర్గంలో 4 కోట్ల రూ.లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని, స్త్ర్రీ శక్తి భవనాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 94 శాతం పూర్తి చేశామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని మహిళా సంఘాల ద్వారానే చేపడతామని అన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన, వెనుకబడిన తరగతులకు సంక్షేమ, ఆర్ధిక ఫలాలను అందించడం జరుగుతున్నాయన్నారు. పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయన్నారు. చదువులకయ్యే ఖర్చు, వైద్య ఖర్చులు ఎక్కువ ఉన్న నేపధ్యంలో ప్రభుత్వ పరంగా ఇలాంటి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, మహిళలు అక్షరాస్యత, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు లాంటి కార్యక్రమాలను చేపట్టి వంద శాతం పూర్తిచేయాలని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర్ర పోరాట సమయంలో మహిళల పాత్ర అమోఘమైనదని, మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి.టి.సి. పద్మ, ఎం.పి.పి. ప్రేమలత, సర్పంచ్ స్వరూప, ఎం.పి.డి.ఒ. కె. కిషన్ స్వామి, మహిళా సంఘాల సభ్యులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వసుంధర మండల సమాఖ్యకు 2 కోట్ల విలువగల వడ్డీ లేని బ్యాంకు రుణాల చెక్కును మంత్రి అందజేశారు. రాష్ట్ర్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై సాంస్కృతిక సారధి బృంద కళాకారులచే ఆట, పాటలకు ప్రేక్షకులకు మంత్రముగ్దులయ్యారు.

eatela    rajender     women shakti

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *