ఓడితే ఇంటికే.. ఇండియా-ఆస్ట్రేలియా.. ఎవరు గెలుస్తారంటే..

ప్రపంచకప్ టీట్వంటీలో కీలక ఫైట్ రంగం సిద్ధమైంది.. ఇవాళ జరిగే పోరులో భారత్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి..  ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ కు చేరుతుంది. ఓడితే ఇంటికే పరిమితమవుతుంది. ఇంతటి కీలక మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠ మద్య జరిగే మ్యాచ్ లో భారత ఫాం చూస్తే గెలుపు కష్టమేనని పిస్తోంది.. గత ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణించిన భారత జట్టు ఇండియాలో జరిగే ప్రపంచకప్ టీట్వంటీ లో మాత్రం ఇప్పటివరకు తన సత్తాను చూపలేదు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ లతో జరిగిన మ్యాచ్ లు చేస్తే భారత గెలవడానికి ఆపసోపాలు పడింది. న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడింది..

ఈ నేపథ్యంలో బలంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులభం కాదు. గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ 193 పరుగులు చేసి రికార్డు నమోదు చేసింది . భారీ విజయం సాధించింది. భారత్ ఇప్పటివరకు కనీసం 150 పరుగులు చేయలేదు. దీంతో ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు బ్యాంటింగ్ లో రాణిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. లేకపోతే ఇండియా ప్రపంచకప్ టీట్వంటీ నుంచి నిష్ట్ర మించడం ఖాయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *