‘ఓట్ల’ ముందర ‘పల్లా’కు అపనింద

0111

‘ఎక్కడ కొట్టాలో తెలిసిన వాడు మొగాడురా బుజ్జీ’ ఇది ఫేమస్ డైలాగ్.. కానీ ఎక్కడా తగ్గకూడదని నిరూపిస్తోంది ఓ పత్రికా సంస్థ. మార్చి 22.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్ఎస్ తరఫున వరంగల్-ఖమ్మ-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వరరెడ్డి బరిలో నిలిచారు. ఇంకో మూడు రోజుల్లో ఎన్నికలనగా ఆయన సర్కారీ భూమిని కబ్జా చేశారంటూ ఓ పత్రిక కథనం ప్రచురితమైంది. ఇది రాజకీయంగా ఆయనకు పెద్ద దెబ్బ. ప్రతిపక్షాలకు అందివచ్చిన ఆయుధం. ఈ పత్రిక కథనం యథాలాపంగా ఓట్లు వేసే ప్రతి గ్రాడ్యూయేట్ పై ప్రభావం చూపుతుంది. ఆయన ఓడినా ఓడిపోవచ్చు. అంతటి బలమైన కథనాన్ని ఎన్నికలకు ముందు రోజు ప్రచురితమవడం ‘పల్లా’కు కోలుకోలేని దెబ్బగానే చెప్పొచ్చు..

టీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రతిపక్షంగా కొట్లాడుతున్న ఆ పత్రిక వరసుగా టీఆర్ఎస్ లోని అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపై కథనాలు వెలువరిస్తూనే ఉంది. మొన్న ఆదిలాబాద్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెరువు కబ్జా, నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనప్ప సున్నపురాయి దోపిడీ.. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థలం కబ్జా ఇలా వరుస కథనాలతో టీఆర్ఎస్ శిబిరాన్ని గుబులు రేపుతున్న తెలుగు పత్రిక ఫైట్ టీఆర్ఎస్ తో నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. ప్రధానం ఆ పత్రిక యాజమాన్యం నిర్వహిస్తున్న చానల్ ను తెలంగాణలో ప్రసారం కాకుండా అడ్డుకోవడం ఈ ప్రచ్చన్న యుద్దానికి కారణం.. ఇందులో కేసీఆర్ ఉడుం పట్టు .. ఆ పత్రిక బెట్టుతో తగ్గ పోరు నడుస్తోంది. పాఠకులకు కనువిందు చేస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *