Breaking News

ఓట్లేసేందుకు తరలివచ్చిన సెక్స్ వర్కర్లు

Prostitute-Re

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంతగా వృద్ధులు, యువకులు, నడివయసువారు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదు 67.14 శాతం ఈ ఎన్నికల్లో నమోదైంది.ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీదే అధికారం అని తేల్చాయి. మరి ఆప్ విజయానికి గల కారణాలేంటని ఆరాతీస్తున్నారు.

ఈ సారి ఎన్నికల్లో యువత , వృద్ధులు, మహిళలతో పాటు పెద్ద ఎత్తున ఉన్న సెక్స్ వర్లర్లు కూడా ఓటేసేందుకు తరలివచ్చారంటే ఎన్నికల వేడి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కలేదు. హంగ్ ఏర్పడి కాంగ్రెస్ సాయంతో ఆప్ అధికారంలోకి వచ్చింది. కానీ రాజకీయ అనిశ్చితి వల్ల పాలన 2 నెలల్లోనే ముగిసింది.దీంతో ఢిల్లీ ఓటర్లు ఈసారి ఎలాగైనా ఒక్క పార్టీకే అధికారం ఇవ్వాలని.. మెజార్టీ కట్టబెట్టాలని పెద్ద ఎత్తున ఓటింగ్ కు హాజరయ్యారు. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిసింది..

నీతిమంతమైన పాలన, నిజాయితీతో వస్తున్న ఆమ్ ఆద్మీకే ఈ ఓటు చేరిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. యువతలో, మహిళల్లో కేజ్రీవాల్ కు ఉన్న క్రేజ్ ఈసారి గెలుపు అవకాశాలను మెరుగుపరచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఖరకు సెక్స్ వర్కర్లు సైతం భారీ సంఖ్యలో క్యూలో నిలబడి ఓటేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పడుపు వృత్తిని న్యాయబద్ధం చేస్తానన్న కేజ్రీవాల్ హామీ కూడా వారు రావడానికి సహకరించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *