ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉంది

ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉంది

-మంత్రి ఈటల రాజేందర్
-గ్రామాల్లో విస్త్రృత ప్రచారం
అవరై ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన టీఆర్ఎస్ కే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం, నగురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓట్లు అడగడానికి రాలేదని, హక్కుతోనే వచ్చానని అన్నారు. 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎనిమేదేళ్లు ఉద్యమం కోసమే కొట్లాడినట్లు చెప్పారు. అందరూ గర్వాంగా చెప్పుకునే విధంగా కొట్లాడి తెలంగాణ తెచ్చినమన్నారు. ఆటో డ్రైవర్ల టాక్స్, రైతుల ట్రాక్టర్ల ట్యక్స్ రద్దు చేశామన్నారు. 346 రకాల పనులు తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. గతంలో ఎస్సారెస్పీ కెనాల్ లోకి నీళ్లు రాలేదని, తెలంగాణ వచ్చాక నీళ్లు సెలయెరూలా పారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ముఖాలకు 24 గంటల కరెంట్ ఇచ్చారా? అని, తెలంగాణ ప్రభుత్వం ఎం సాధించింది అని చెప్పడానికి 24 గంటల కరెంట్ ఒక మచ్చు తునకని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం జోడు ఎద్దులా కలిసి తిరుగుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టవద్దని కాంగ్రెస్ నాయకులు 246 కేసులు వేశారన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతామన్నారు. గడ్డి పొసను నమ్మినోల్లమని, చీమకు కూడా అన్యాయం చేయబోమని అన్నారు. నీచమైన రాజకీయాలు నడుస్తున్నాయని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ‘నా ముఖం ఏమైనా హత్య రాజకీయాలు చెయ్యడానికి వచ్చినట్లు కనపడుతుందా..? నన్ను విమర్శించే వ్యక్తి ముఖం చూడండి ఎలా మీసాలు తిప్పి పేపర్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాట్లాడుతున్నాడో..’ చూడండి అని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రచార సభలో చూపించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *