Breaking News

ఓటుకు నోటు నుంచి చంద్రబాబును తప్పించినట్టే..

08-kcr-cbn-first-cms-60

దేశంలోని జాతీయ రాష్ట్రీయ చానాళ్లన్నీ ఘోషించాయి.. ఏపీ సీఎం చంద్రబాబును వేలెత్తి చూపించాయి.. రేవంత్ రెడ్డిని ప్రదాన ముద్దాయిగా చూపించాయి.. అయినా చివరకు కేంద్ర ఒత్తిడితో.. చంద్రబాబు పన్నాగంతో ఓటుకు నోటు నీరుగారిపోయింది..

చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమనుకున్నారు అంతా… కానీ వెనుకలా తతంగం చాలా జరిగింది.. ఓటుకు నోటుకు ట్యాపింగ్ విరుగుడుతో కేంద్రం తీవ్ర ఒత్తిడితో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.. స్వయంగా ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఎరచూపి దొరికిపోయిన దొంగబాబు చంద్రబాబు ఇప్పుడు దొరబాబుగా మారిపోయాడు.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అభాసుపాలైంది.. భీకర ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏసీబీ చార్జ్ షీట్ లో చంద్రాబాబు పేరే పెట్టకపోవడం కేసు నుంచి తప్పించినట్టే అని అర్థమవుతోంది..

చంద్రబాబును కేసీఆర్ తప్పించడంలో రెండు కారణాలున్నాయి. ఒకటి టీ. ప్రభుత్వంపై ట్యాపింగ్ ఆరోపణ, మరోటి కేంద్ర ఒత్తిడి.. న్యాయస్థానంలో కేసు పరిగణలోకి రాకపోవడం వీటన్నింటి వల్ల ఓటుకు నోటు నుంచి చంద్రబాబు తప్పించుకున్నట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *