Breaking News

ఓటుకు నోటు కేసులో సండ్ర అరెస్ట్…

SANDRA.V.V

ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీ.డీ.పీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం నాడు అరెస్ట్ చేసారు. వెంకట వీరయ్యను తమ కార్యాలయానికి పిలిచిన ఏసీబీ అధికారులు 7గంటల పాటు విచారించి తదనంతరం అరెస్ట్ చేసారు. అరెస్ట్ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంకట వీరయ్యకు గతంలో ఏసీబీ నోటిసు జారిచేసినప్పుడు ఆయన అప్పుడు విచారణకు హాజరు కాలేరు. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో వెంకట వీరయ్య మీడియా ముందుకు వచ్చారు. ఏసీబీ నోటిసు అందుకున్న సండ్ర ఈ రోజు ఉదయం విచారణకు హజరయ్యాడు. ఓటుకు నోటు కేసులో ఇది నాల్గో అరెస్ట్. వెంకట వీరయ్యను మంగళవారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. సండ్ర అరెస్ట్ తో తెలుగుదేశం నేతలలో గుబులు మొదలయ్యింది. ఈ కేసులో మరో నిందితుడిగా వున్న జిమ్మి బాబు పరారిలో ఉన్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయి గా ఉన్న మత్తయ్యకు సండ్ర వెంకట వీరయ్య 8 సార్లు ఫోన్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును టీ.డీ.పీ నేతలు ఖండిస్తున్నారు. ఉద్ద్యేశపూర్వకంగానే దేశం నేతల పై కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *