
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఈవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోబోతు న్నాయి. మత్తయ్య తనను కేసు నుంచి తొలగించాలని పెట్టుకున్న క్యాష్ పిటీషన్ ను ఈవాళ కోర్టు విచారించనున్నారు. అలాగే మత్తయ్య పిటీషన్ పై స్టీఫెన్ సన్ పెట్టుకు నాట్ బిఫోర్ మి పిటీషన్ పై కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. న్యాయమూర్తి శివశంకర్ ఈ విచారణ నుంచి తప్పుకోవాలని ఆయన ఈ పీటీషన్ వేశారు.
అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ విచారణ హాజరుకావాలంటూ ఇచ్చిన గడువు తీరిపోయింది. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.