ఓటుకు నోటుకు.. సీబీఐ పోటు..

సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసులో  వెనక్కి తగ్గడానికి కారణమేమై ఉంటుందీ.. చంద్రబాబును రక్షించడానికి కారణమేంటి.? .. అమరావతి కి పిలవగానే బద్ధ శత్రువు అయినా చంద్రబాబు వెంట వెళ్లడానికి కారణమేంటి అని ఇప్పుడు రకరకాల ప్రశ్నలు రాజకీయ నాయకులను తొలిచివేస్తున్నాయి..

ఈ పరిణామాలన్నీ గమనించాక ఒక్క విషయం అర్థం అవుతోంది.. చంద్రబాబు, మోడీ లు వేసిన ప్లాన్ కు కేసీఆర్ వెనక్కి తగ్గారు. అసలు కథ ఏంటంటే చంద్రబాబు నాయుడుపైకి కేసీఆర్ ఓటుకు నోటు కేసును ప్రయోగించారు. ఆ విషయంలో చంద్రబాబును అరెస్ట్ కూడా చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి.. కానీ చివరకు అంతా చల్లబడి వెనక్కి తగ్గారు.

సీబీఐ ప్రయోగమే కేసీఆర్ తగ్గడానికి కారణం.?

2006లో కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా చేశారు. అప్పట్లో ఒక కాంట్రాక్టుకు సంబంధించి వేరొకరి కట్టబెట్టారు. ఆ వ్యక్తి రూ.5 కోట్ల అవినీతి జరిగింది.. సూర్యనారాయణ అనే కాంట్రాక్టర్ చేసిన పనికి సంబంధం లేకున్నా ఆశాఖ మంత్రి అయిన పాపానికి కేసీఆర్ ను ఇరికించారు సీబీఐ అధికారులు.. కాదు కాదు.. ఇరికించారు.

చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు పెట్టినందుకు ఇలా చంద్రబాబును కేసుల్లోకి లాగి వెనక్కి తగ్గేలా చేశారనే వాదనలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ తగ్గి చంద్రబాబుపై కేసు పెట్టలేదు.. మోడీ, చంద్రబాబుల సీబీఐ ప్రయోగించి కేసీఆర్ ను కంట్రోల్ చేశారనే గుసగుసలు వినపబడుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *