Breaking News

‘ఓటుకు కోట్లు’ ఏపీలో అమలుచేస్తున్నారు..

275483-1899742

తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కోట్లు కుమ్మరించిన సంగతి తెలిసిందే.. కానీ ఏపీలో కూడా టీడీపీ అదే దందా నిర్వహిస్తోంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీటీసీలు,సర్పంచ్ లు, కౌన్సిలర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కనీసం వైసీపీ కి 13 ఓట్లు కూడా రాకుండా చేసింది. ఇంత భారీ ఎత్తున కొనుగోళ్లకు పాల్పడి ఓటుకు కోట్లు పార్టీ గా టీడీపీ సార్థకం చేసుకుంది.

చంద్రబాబు పైకి నీతి సూత్రాలు చెబుతూ లోపల అవినీతి మహారాజ్ గా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత జగన్ మంగళవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ వైఖరి మార్చుకోవాలని లేకపోతే ప్రజలు గద్దె దించుతారని జగన్ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే భూమా అరెస్ట్ పై పోలీసులు, ప్రభుత్వం తీరును ఆయన తప్పుపట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *